మహేశ్‌బాబుతో సితార క్యూట్ పిక్స్‌.. పోస్ట్ చేసిన నమ్రత
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహేశ్‌బాబుతో సితార క్యూట్ పిక్స్‌.. పోస్ట్ చేసిన నమ్రత

sitara with her father mahesh babu
  • ఏదో దీర్ఘాలోచనలో పడినట్లు ఓ ఫొటోలో సితార
  • మరో ఫొటోలో తండ్రి, సోదరుడితో క్యూట్ పిక్
  • విదేశాల్లో ఫొటోలు దిగిన సితార
సినీనటుడు మహేశ్‌ బాబు కూతురు సితారకు సంబంధించిన రెండు ఫొటోలు అబ్బురపరుస్తున్నాయి. తండ్రి మహేశ్, తల్లి నమత్రతో పాటు కూర్చొని పెద్ద ఆరిందాలా ఆమె ఏదో దీర్ఘాలోచనలో పడినట్లు ఒక ఫొటోలో సితార క్యూట్ గా ఉంది. మరో ఫొటోలో తండ్రి, సోదరుడి మధ్యలో నిలబడి ఫొటో దిగింది. ఈ ఫొటోలను నమ్రత తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేసింది.
              
సితారకు సంబంధించిన విశేషాలపై నెటిజన్లు బాగా ఆసక్తి కనబరుస్తున్నారు. తన కూతురికి సంబంధించిన అప్ డేట్లను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో నమ్రత పోస్ట్ చేస్తుంటుంది. మొదటి ఫొటోలో ఆమె ఏదో చదువుతున్నట్లు కనపడుతోంది. రెండో ఫొటోలో తండ్రి, సోదరుడితో కలిసి ఏదో సరదా పని చేస్తూ నవ్వులు చిందిస్తూ నిలబడింది. విదేశాల్లో ఈ ఫొటో తీసినట్లు తెలుస్తోంది.
sitara
Mahesh Babu
Tollywood
namrata

More Telugu News