ట్రంప్ భారత్ లోనూ మమ్మల్నే పొగిడాడు... గొప్పలు చెప్పుకుంటున్న పాక్ మీడియా
- 'నమస్తే ట్రంప్' కార్యక్రమంలో ట్రంప్ ప్రసంగం
- ఉగ్రవాదంపై పాక్ తో కలిసి పనిచేస్తున్నామన్న ట్రంప్
- ట్రంప్ వ్యాఖ్యలను ఇష్టానుసారం మార్చుకున్న పాక్ మీడియా సంస్థలు
'ద న్యూస్ ఇంటర్నేషనల్' ఓ అడుగు ముందుకేసి, పాకిస్థాన్ తో భారత్ సంబంధాలు బహు బాగున్నాయని ట్రంప్ చెప్పారంటూ ఓ కథనంలో వివరించింది. వాస్తవానికి 'నమస్తే ట్రంప్' కార్యక్రమంలో ట్రంప్ చెప్పింది ఏంటంటే... సరిహద్దుల్లో ఉన్న ఉగ్రమూకల నిర్మూలన విషయంలో పాకిస్థాన్ తో కలిసి పనిచేస్తున్నాం అన్నారు. కానీ పాక్ మీడియా సంస్థలు దాన్ని ఇష్టానుసారంగా మార్చుకున్నాయి.