"కళ్లు చెదిరిపోయాయి".... నమస్తే ట్రంప్ కార్యక్రమంపై ఇవాంకా స్పందన
- భారత పర్యటనకు కుటుంబంతో కలిసి విచ్చేసిన ట్రంప్
- మొతేరా స్టేడియంలో ఇసుకేస్తే రాలనంత జనాన్ని ఉద్దేశించి ట్రంప్ ప్రసంగం
- నమస్తే ట్రంప్ కార్యక్రమం చూసి సంతోషంతో పొంగిపోయిన ఇవాంకా
తన తండ్రి మాట్లాడుతుండగా ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందన చూసి ఆమె సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమం అనంతరం మీడియా ప్రతినిధులు ఆమె స్పందన కోరారు. దాంతో ఇవాంకా "స్పెక్టాక్యులర్" అంటూ ఒకే ఒక్క పదంతో తన అనుభూతిని వ్యక్తం చేశారు. 'కళ్లు చెదిరిపోయాయి' అనే అర్థం వచ్చేలా ఆమె చెప్పిన జవాబు ట్రంప్ కు భారత గడ్డపై లభిస్తున్న ఆదరణను చాటుతోంది.