హిందీలో ట్వీట్ చేసిన ట్రంప్‌కు హిందీలోనే రిప్లై ఇచ్చిన ప్రధాని మోదీ
Add ap7am to your home Screen

హిందీలో ట్వీట్ చేసిన ట్రంప్‌కు హిందీలోనే రిప్లై ఇచ్చిన ప్రధాని మోదీ

modi replies to trump
  • 'వచ్చేస్తున్నా' అంటూ విమానంలోంచి హిందీలో ట్వీట్ చేసిన ట్రంప్
  • అతిథి దేవో భవ అంటూ మోదీ రిప్లై
  • కాసేపట్లో ట్రంప్‌కు ఘన స్వాగతం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాసేపట్లో భారత్‌లో అడుగుపెట్టనున్న నేపథ్యంలో 'వచ్చేస్తున్నా' అంటూ విమానంలోంచి హిందీలో ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఇండియాలో అడుగుపెట్టాలని ఎదురు చూస్తున్నామని, దారిలో ఉన్నామని, కొన్ని గంటల్లో అందరినీ కలుస్తామని ఆయన చెప్పారు.

ఇక ఆయన హిందీలో చేసిన ట్వీట్‌పై వెంటనే స్పందించిన ప్రధాని మోదీ 'అతిథి దేవోభవ' అంటూ హిందీలోనే రిప్లై ఇచ్చారు. ఈ సందర్భంగా ట్రంప్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. కాసేపట్లో ట్రంప్‌తో పాటు ఆయన భార్య మెలానియా, కూతురు ఇవాంక ట్రంప్‌, అల్లుడు జారెడ్‌ కుష్నర్‌ అహ్మదాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు.
Donald Trump
Narendra Modi

More Telugu News