Uttar Pradesh: 'గర్భ్‌ సంస్కార్‌' పేరిట లక్నో వర్సిటీలో కోర్సు

షార్ట్స్‌లో చూడండి
'గర్భ్‌ సంస్కార్‌' పేరిట లక్నో వర్సిటీ సర్టిఫికెట్‌, డిప్లొమా కోర్సును ప్రారంభిస్తోంది.  ఇందులో  గర్భిణులు ఎలాంటి దుస్తులు ధరించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశాలపై శిక్షణనిస్తారు. అలాగే, గర్భిణులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, వారి ప్రవర్తనాశైలి ఎలా ఉండాలి, ఫిట్‌నెస్‌ కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి అన్ని అంశాలను నేర్పిస్తారు.  

ఈ కోర్సు ద్వారా యువతకు ఉపాధి లభిస్తుందని భావిస్తున్నారు. అలాగే, పెళ్లయ్యాక విద్యార్థినులు తల్లులుగా మారే క్రమంలోనూ ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఆ రాష్ట్ర గవర్నర్‌, వర్సిటీల ఛాన్స్‌లర్‌  ఆనందిబెన్‌ పటేల్‌ సూచనల మేరకు ఈ కోర్సులు ప్రవేశపెడుతున్నారు.


Go Back to Shorts
Uttar Pradesh

More Telugu News