త్రివిక్రమ్ సినిమాలో పక్కింటి అబ్బాయిగా ఎన్టీఆర్
- త్రివిక్రమ్ తో మరోసారి ఎన్టీఆర్
- జూన్ లో సెట్స్ పైకి
- నిర్మాణ భాగస్వామిగా కల్యాణ్ రామ్
ఫ్యామిలీ డ్రామాకి సంబంధించిన ఈ కథపైనే త్రివిక్రమ్ కసరత్తు మొదలుపెట్టాడని చెబుతున్నారు. జూన్ నుంచి ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని అంటున్నారు. హారిక అండ్ హాసినివారితో కలిసి ఈ సినిమాను నిర్మించడానికి, కల్యాణ్ రామ్ అంగీకరించాడని సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఈ సినిమా తరువాత వెట్రిమారన్ తో ఎన్టీఆర్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉండొచ్చు.