Smriti Irani: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కొత్త లుక్... ఎలావుందో చూడండి!

Union Minister Smriti Irani gets new hair cut
  • సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే స్మృతీ ఇరానీ
  • సరికొత్త హెయిర్ స్టయిల్ తో ఆకర్షిస్తున్న కేంద్ర మంత్రి
  • హెయిర్ కట్ చేయించుకున్నాను చూడండంటూ పోస్టు
సామాజిక మాధ్యమాల్లో ఎంతో యాక్టివ్ గా ఉండే కేంద్రమంత్రుల్లో స్మృతీ ఇరానీ ఒకరు. ఆమెకు లక్షల్లో ఫాలోవర్లు ఉన్నారు. స్మృతి వృత్తిపరంగా హుందాగా ఉంటూనే, తన చేతల్లో జోష్ ప్రదర్శిస్తుంటారు. సాధారణంగా భారతీయత ఉట్టిపడే రీతిలో ఆమె కట్టుబొట్టు ఉంటాయి. తాజాగా, స్మృతి సరికొత్త హెయిర్ స్టయిల్ తో ఆశ్చర్యానికి గురిచేశారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫొటోలు సందడి చేస్తున్నాయి. 'ఇవాళ హెయిర్ కట్ చేయించుకున్నాను, రేపు మళ్లీ మామూలుగా ముడివేసుకుంటా' అంటూ ఆమె తన ఫొటోలను పోస్టు చేశారు.
Smriti Irani
BJP
Hair Style
New Look

More Telugu News