Junior NTR: ఆ తేదీల్లో ఎన్టీఆర్ .. చరణ్ ఫస్టులుక్స్

  • షూటింగు దశలో 'ఆర్ ఆర్ ఆర్'
  • 70 శాతానికి పైగా జరిగిన చిత్రీకరణ
  • అభిమానుల్లో పెరుగుతున్న ఆసక్తి   
NTR and Charan first looks from RRR Movie

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ .. చరణ్ కథానాయకులుగా 'ఆర్ ఆర్ ఆర్' రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా 70 శాతానికి పైగా చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా నుంచి రానున్న ఎన్టీఆర్ .. చరణ్ ఫస్టులుక్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చరణ్ ఫస్టులుక్ ముందుగా పలకరించనుందనే టాక్ ఒకటి ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది.

చరణ్ పుట్టిన రోజు మార్చి 27వ తేదీన. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని, చరణ్ ఫస్టులుక్ ను రాజమౌళి రిలీజ్ చేయనున్నట్టు చెబుతున్నారు. ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20వ తేదీన .. ఆ రోజున ఆయన ఫస్టులుక్ ను విడుదల చేస్తారట. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ .. పాత్రలను పరిచయం చేస్తూ ఈ ఫస్టులుక్ పోస్టర్స్ ఉంటాయని అంటున్నారు. ఆ తరువాత నుంచి ఒక్కొక్కరి పాత్రల పరిచయం జరుగుతుందని చెబుతున్నారు.

More Telugu News