దారుణంగా పతనమైన టమాటా ధరలు.. రూపాయికీ అమ్ముడుపోని వైనం!
- విశాఖ జిల్లా కృష్ణదేవిపేట మార్కెట్లో పరిస్థితి ఇదీ..
- కొనేవారు లేక సాయంత్రం వరకు ఎదురుచూసిన రైతులు
- దిగుబడులు పెరగడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని ఆవేదన
30 కిలోల (క్రేటు) టమాటాలను రూ.30కి కూడా కొనేవారు లేకపోవడంతో రైతులు నిరాశ చెందారు. చివరికి పోగులుగా పోసి విక్రయించాల్సి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలను చూసి సంబరపడ్డామని, కానీ ఇలా జరుగుతుందని మాత్రం ఊహించలేకపోయామని వాపోయారు.