బావిలో దూకి కుర్రాడిలా ఈతకొట్టిన రఘువీరారెడ్డి
ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కుర్రాళ్లను తలపించే రీతిలో ఓ పెద్ద బావిలో ఈత కొట్టారు. అనంతపురం జిల్లాలోని నీలకంఠపురంలో ఉన్న తన వ్యవసాయక్షేత్రంలో రఘువీరా ఈత కొడుతూ సేదదీరారు. ఆయనతో పాటు కొందరు బీసీ హాస్టల్ విద్యార్థులు కూడా బావిలో ఈదారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో మీడియాలో ఓ చానల్ లో ప్రసారమైంది. ఎంతో లోతున్న బావిలో ఆయన అలవోకగా ఈదుతూ విద్యార్థులను విస్మయానికి గురిచేశారు.