సీఐడీ విషయం కాస్త చూడండి.... తెలంగాణ సీఎస్ కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ
- తెలంగాణ సీఐడీపై ఫిర్యాదు చేసిన ఫోరం
- సీఐడీపై ప్రజల్లో నమ్మకం పోతోందని విమర్శలు
- నానాటికీ పెండింగ్ కేసుల సంఖ్య పెరుగుతోందని వెల్లడి
తెలంగాణ ఏర్పడినప్పుడు 242 కేసులు పెండింగ్ లో ఉంటే, ఇప్పుడు పెండింగ్ కేసుల సంఖ్య 403కి చేరిందని ఫోరం గుర్తుచేసింది. సీఐడీకి నిధులు పెరుగుతున్నాయే తప్ప, కేసుల ఛేదనలో ఎలాంటి పురోగతి లేదని విమర్శించింది. ఏళ్లు గడుస్తున్నా ఇందిరమ్మ ఇళ్ల కుంభకోణం కేసును ఓ కొలిక్కి తీసుకురాలేకపోయారని తన లేఖలో ఆరోపించింది. సీఐడీ పనితీరును సమీక్షించాలని సీఎస్ ను ఫోరం ఈ లేఖలో కోరింది.