'కేజీఎఫ్ 2' క్లైమాక్స్ సీన్స్ హైదరాబాద్ లోనే!
- సంచలన విజయాన్ని నమోదు చేసిన 'కేజీఎఫ్'
- మైసూర్లో ముఖ్య సన్నివేశాల చిత్రీకరణ
- తదుపరి షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో
ఇందులో ప్రతినాయకుడిగా సంజయ్ దత్ నటిస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై క్రేజ్ ఒక రేంజ్ లో పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మైసూర్లో జరుగుతోంది. అక్కడ కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. చివరి షెడ్యూల్ ను హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేశారు. క్లైమాక్స్ కి సంబంధించిన కీలకమైన యాక్షన్ సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తారట. ఇక్కడ చిత్రీకరించే యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు.