మండలి వ్యవస్థకు సీపీఐ వ్యతిరేకం.. అయినా వైసీపీ స్వార్థంతో తీర్మానించడాన్ని ఖండిస్తున్నాం: సీపీఐ నారాయణ

  • బలముందని మండలిని రద్దు చేయడం సరికాదు
  • 4 నెలలు ఆగితే మండలిలో వైసీపీ బలం పెరిగేది
  • బిల్లు ఆమోదం పొందలేదని.. మండలినే రద్దు చేస్తారా?
ఆంధ్రప్రదేశ్ లో శాసనమండలి రద్దుకోసం వైసీపీ ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేయడాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఖండించారు. బలముందని మండలిని రద్దు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిల్లు ఆమోదం పొందలేదన్న కారణంతో ఏకంగా శాసన మండలిని రద్దు చేయడం అనుచిత చర్య అని పేర్కొన్నారు.

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అనుమతితోనే ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. శాసన మండలి వ్యవస్థకు సీపీఐ వ్యతిరేకమని, అయితే, స్వార్థ ప్రయోజనాలకోసం వైసీపీ ప్రభుత్వం చేసిన ఈ నిర్ణయాన్ని ఖండిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. జగన్ నిర్ణయాలతో వ్యవస్థలకు నష్టం వాటిల్లుతోందన్నారు. నాలుగు నెలలు ఆగితే మండలిలో వైసీపీ బలం పెరిగేదన్నారు.
Go Back to Shorts
CPI Narayana
AP Legislative Council
Abolition
Resoultion

More Telugu News