అసోం ముఖ్యమంత్రి ఎదుట ఆయుధాలతో లొంగిపోయిన 644 మంది మిలిటెంట్లు
- లొంగిపోయిన 8 గ్రూపులకు చెందిన మిలిటెంట్లు
- ఇది అద్భుతమైన రోజు అన్న రాష్ట్ర డీజీపీ
- అందరికీ పునరావాసం కల్పిస్తామని ప్రకటన
లొంగిపోయిన వారు 8 మిలిటెంట్ గ్రూపులకు చెందినవారని మహంత తెలిపారు. వీరంతా తమ ఆయుధాలను వదిలేసి జనజీవన స్రవంతిలో కలిసిపోయారని చెప్పారు. ముఖ్యమంత్రి సమక్షంలో లొంగిపోయిన సమయంలో వారు తమ వద్ద ఉన్న ఏకే-47, ఏకే-56 ఆయుధాలతో పాటు బాంబులు, పేలుడు పదార్థాలను కూడా పోలీసులకు అందించారని తెలిపారు. స్వావలంబన పథకం కింద వీరందరికీ పునరావాసం కల్పిస్తామని చెప్పారు.