మండలి చైర్మన్ నిర్ణయంపై సీపీఐ హర్షం... జగన్ ఇప్పటికైనా మొండిపట్టు వీడాలన్న రామకృష్ణ
- వికేంద్రీకరణ బిల్లుకు మండలిలో చుక్కెదురు
- బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిన మండలి చైర్మన్
- చైర్మన్ నిర్ణయాన్ని స్వాగతించిన సీపీఐ రామకృష్ణ
వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ చట్టం ఉపసంహరణ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడం హర్షణీయం అని ఆయన పేర్కొన్నారు. సీఎం జగన్ ఇప్పటికైనా మొండిపట్టు వీడాలని అన్నారు. అటు, రాజధాని అమరావతి ప్రాంతంలో మండలి పరిణామాలపై సంతోషం వ్యక్తమవుతోంది. రైతులు మండలి చైర్మన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు.