Mahesh Babu: 'రమణా లోడెత్తాలిరా ..' డైలాగ్ ఆ స్థాయిలో పేలుతుందని అనుకోలేదు: నటుడు సేతురామన్

షార్ట్స్‌లో చూడండి
'సరిలేరు నీకెవ్వరు' సినిమా చూసిన వాళ్లకి, 'రమణా లోడెత్తాలిరా .. చెక్ పోస్ట్ పడతాది' అనే డైలాగ్ బాగా గుర్తుంటుంది. ఫారెస్ట్ లో ఒక స్మగ్లింగ్ గ్యాంగ్ తో మహేశ్ బాబు ఫైట్ చేయడానికి రంగంలోకి దిగుతాడు. ఆ సమయంలో ఆ గ్యాంగ్ లీడర్ గా వున్న వ్యక్తి, మహేశ్ బాబును లైట్ తీసుకుంటూ ఈ మాట అంటుంటాడు. ఆ డైలాగ్ చెప్పిన నటుడే సేతురామన్.

ఈ ఒక్క సీన్ తో ఆయన పాప్యులర్ అయ్యాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ... " ఈ సీన్ చేస్తున్నప్పుడు ఈ డైలాగ్ ఈ స్థాయిలో పాప్యులర్ అవుతుందని నేను అనుకోలేదు. రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్ .. అనిల్ గారు రాసిన డైలాగ్ .. నా డైలాగ్ ను మహేశ్ బాబు రిపీట్ చేయడం వలన ఆ సీన్ అంత బాగా వచ్చింది. ఈ పాత్ర ఇంత గుర్తింపు తీసుకొచ్చినందుకు చాలా ఆనందంగా వుంది. షూటింగు సమయంలో మహేశ్ బాబు నాతో ఆప్యాయంగా మాట్లాడటం నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేను"అని చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
Mahesh Babu
SethuRaman

More Telugu News