చంద్రబాబు లాంటి డర్టీ పొలిటిషియన్ లేడని కేసీఆర్ అన్నారు: రోజా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంద్రబాబు లాంటి డర్టీ పొలిటిషియన్ లేడని కేసీఆర్ అన్నారు: రోజా

  • అమరావతికి ఎవ్వరూ వ్యతిరేకం కాదు 
  • రాజధానికి మేము కూడా అప్పట్లో సపోర్ట్ చేశాం 
  • చంద్రబాబు, లోకేశ్ కలిసి రాష్ట్రాన్ని దోచుకున్నారన్న రోజా
ప్రధాని మోదీ మట్టి, నీళ్లు తెచ్చారని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి ఇక్కడ అమరావతి భూమి పూజలో పాల్గొన్నారని టీడీపీ నేతలు అంటున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. అమరావతిలోనే రాజధాని ఉండాలంటూ వాదనలు చేస్తున్నారని ఆమె అన్నారు. మరి అదే మోదీ కూడా చంద్రబాబుపై గత ఎన్నికల్లో విమర్శలు గుప్పించారని రోజా గుర్తు చేశారు. చంద్రబాబును కేసీఆర్ పొగిడారని టీడీపీ నేతలు అంటున్నారని, మరి చంద్రబాబు లాంటి డర్టీ పొలిటిషియన్ లేడని కేసీఆర్ కూడా అన్నారని రోజా అన్నారు.

అమరావతికి ఎవ్వరూ వ్యతిరేకం కాదని రోజా చెప్పారు. అమరావతిలో రాజధానికి తాము కూడా అప్పట్లో సపోర్ట్ చేశామని తెలిపారు. ఈ ఐదేళ్లలో ఒక్క శాశ్వత నిర్మాణం కూడా చేయలేదని ఆమె తెలిపారు. చంద్రబాబు, లోకేశ్ కలిసి రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆమె ఆరోపించారు. సన్‌రైజ్‌ మాటున చంద్రబాబు బాబు తన సన్ ను రైజింగ్ చేశారని ఆమె ఎద్దేవా చేశారు.
Chandrababu
KCR
Roja

More Telugu News