నిజమే .. అందులో వృద్ధురాలిగానే కనిపిస్తాను: హీరోయిన్ కాజల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నిజమే .. అందులో వృద్ధురాలిగానే కనిపిస్తాను: హీరోయిన్ కాజల్

  • షూటింగు దశలో 'భారతీయుడు 2'
  • ఆశ్చర్యపరిచేలా కాజల్ మేకప్ 
  • భయపడ్డానన్న కాజల్
తెలుగు .. తమిళ భాషల్లో అందాల కథానాయికగా కాజల్ కి మంచి క్రేజ్ వుంది. సీనియర్ స్టార్ హీరోల సరసన అవకాశాలతో ఆమె దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆమె కమల్ కథానాయకుడిగా చేస్తున్న 'భారతీయుడు 2'లో నటిస్తోంది. 'భారతీయుడు'లో సుకన్య చేసిన పాత్ర తరహాలో ఈ సీక్వెల్లో కాజల్ వృద్ధురాలి పాత్రలో కనిపించనుందనే టాక్ వచ్చింది. అయితే అలాంటి పాత్రను కాజల్ అంగీకరించకపోవచ్చని అంతా అనుకున్నారు.

కానీ తాజా ఇంటర్వ్యూలో కాజల్ మాట్లాడుతూ, ఈ సినిమాలో తాను వృద్ధురాలి పాత్రలో కనిపించనుండటం నిజమేనని చెప్పింది. "ఈ పాత్రను నేను చేయగలనా .. లేదా అనే సంశయంతో చాలా భయపడ్డాను. కానీ నా మేకప్ చూసి నాకే ఆశ్చర్యం కలిగింది .. నాపై నాకు నమ్మకం పెరిగింది. ఈ పాత్ర నా కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందనే నమ్మకం వుంది" అని చెప్పుకొచ్చింది.
Kamal
Kajal

More Telugu News