'ముప్పావలా' సినిమాపై రామ్ గోపాల్ వర్మ వివరణ
- వర్మ తదుపరి చిత్రం 'ముప్పావలా' అంటూ ఫేక్ న్యూస్
- ఆ ట్వీట్ చేసింది నేను కాదన్న వర్మ
- ఎవరో పోస్ట్ చేశారంటూ వ్యాఖ్య
ఇది నిజమే అన్నట్టుగా... ఆయన పేరిట ఓ ట్వీట్ వైరల్ అయింది. తన కొత్త సినిమాను ప్రకటిస్తుండటం తనకు చాలా సంతోషంగా ఉందంటూ ఆయన పేరిట ట్వీట్ వచ్చింది. తన తదుపరి చిత్రం 'ముప్పావలా' అంటూ ఓ పోస్టర్ షేర్ చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కథాంశంతో సినిమా వస్తున్నట్టు పోస్టర్ చాలా క్లియర్ గా ఉంది. ఇది సంచలనంగా మారింది.
ఈ క్రమంలో, దీనిపై రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఆ ట్వీట్ తనది కాదని ట్విట్టర్ ద్వారా తెలిపారు. మార్ఫింగ్ చేసిన ఇమేజ్ తో దాన్ని ఎవరో పోస్ట్ చేశారని... దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు. కావాలనుకుంటే ఎవరైనా సరే తన ట్వీట్ హిస్టరీని చెక్ చేసుకోవచ్చని తెలిపారు.