రష్మిక మందన్న ఇంటిపై ఐటీ దాడులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రష్మిక మందన్న ఇంటిపై ఐటీ దాడులు!

  • గత రెండేళ్లలో పలు హిట్ చిత్రాలు
  • ప్రభుత్వానికి పన్ను ఎగ్గొట్టినట్టు అనుమానాలు
  • ఇల్లు, ఫ్లాట్, కార్యాలయాల్లో సోదాలు
దక్షిణాది స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఇంట్లో ఈ ఉదయం నుంచి ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు జరుగుతున్నాయి. గత రెండేళ్లుగా పలు హిట్ చిత్రాల్లో నటించిన ఆమె, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను ఎగ్గొట్టినట్టు అనుమానిస్తున్న అధికారులు, దాడులు జరిపి, ఆమె ఆస్తిపాస్తుల వివరాలను పరిశీలిస్తున్నారు.

కర్ణాటక, కొడుగు సమీపంలోని విరాజ్ పేటలో ఉన్న ఆమె ఇంటితో పాటు, బెంగళూరులోని ఫ్లాట్, కార్యాలయంలో ఏకకాలంలో సోదాలు జరుపుతున్నారు. తెలుగు సినిమాల్లో నటించడం ప్రారంభించినంత వరకూ మేనేజర్ ను కూడా ఆమె పెట్టుకోలేదని, ఆమె నుంచి ఒక్కమారు కూడా జీఎస్టీ క్లయిమ్ రాలేదని తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
Rashmika
IT
Tax
Raids

More Telugu News