Online: ఫేస్ బుక్ లో పరిచయమై గుంటూరు యువకుడిని దారుణంగా మోసం చేసిన విదేశీ యువతి!

షార్ట్స్‌లో చూడండి
సామాజిక మాధ్యమాల్లో ఏర్పడే పరిచయాలు ఎంతటి అనర్ధాలకు దారితీస్తాయో తెలియజేసే మరో ఉదంతమిది. గుంటూరుకు చెందిన ఓ యువకుడు, తనకు జరిగిన నష్టాన్ని 'స్పందన'లో తెలియజేశాడు. వివరాల్లోకి వెళితే, కృష్ణదాసు అనే యువకుడికి ఫేస్ బుక్ లో ఓ యువతి పరిచయం అయింది. తనతో ఆమె తరచూ చాటింగ్ చేసేదని, కొన్ని రోజుల క్రితం ఓ బహుమతిని పంపుతున్నానని ఆమె చెప్పగా, నమ్మానని తెలిపాడు.

ఆపై ఓ అపరిచిత వ్యక్తి నుంచి అతనికి ఫోన్ వచ్చింది. మీ పేరిట గిఫ్ట్ వచ్చిందని, చెప్పాడు. ఆ బహుమతికి పన్ను రూపంలో రూ. 30 వేలు కట్టాలని చెబితే, అపరిచితుడు చెప్పిన ఖాతాకు ఆ డబ్బు ఆన్ లైన్ మాధ్యమంగా పంపాడు. మరుసటి రోజున ఇంకో వ్యక్తి ఫోన్ చేసి, బహుమతి చాలా విలువైనదని, ఇంకో రూ. 3 లక్షలు కట్టాలని చెప్పడంతో, ఆ డబ్బు కూడా కట్టాడు. ఆపై వారికి ఎంత ట్రై చేసినా ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో, తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. కేసును విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Go Back to Shorts
Online
Fruad
Lady
Guntur District
Spancana

More Telugu News