పెద్దపల్లికి ‘స్వచ్ఛత దర్పణ్’ పురస్కారం.. అవార్డు అందుకున్న కలెక్టర్ శ్రీదేవసేన
- ‘స్వచ్ఛభారత్’ మిషన్ లో పెద్దపల్లి మరోమారు రికార్డు
- ఢిల్లీలో ‘స్వచ్ఛత’ వర్క్ షాప్ లో పాల్గొన్న శ్రీదేవసేన
- అమీర్ ఖాన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న కలెక్టర్
ఈ అవార్డును పెద్దపల్లి కలెక్టర్ శ్రీదేవసేన ఢిల్లీలో అందుకున్నారు. ‘స్వచ్ఛత’ అనే అంశంపై నిర్వహించిన వర్క్ షాప్ లో ఆమె పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లాలో నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేతులమీదుగా ‘స్వచ్ఛత దర్పణ్’ అవార్డును ఆమె అందుకున్నారు.