నిర్భయ దోషులకు లాస్ట్ చాన్స్... 14న క్యూరేటివ్ పిటిషన్ పై విచారణ!
- జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో విచారణ
- విచారించనున్న ఐదుగురు సభ్యుల ధర్మాసనం
- ఉరి ఖాయమైతే 22న అమలు
కాగా, తన తల్లిదండ్రులు వృద్ధులని, పేదలని, ఈ కేసు కారణంగా సామాజిక హేళనకు గురయ్యారని వినయ్ శర్మ తన క్యూరేటివ్ పిటిషన్ లో పేర్కొన్నాడు. తనను ఉరితీస్తే కుటుంబం ధ్వంసమైపోతుందని వాపోయాడు. ఈ కేసు కారణంగా ఆర్థికంగా చితికిపోయానని పేర్కొన్నాడు. వినయ్ తరఫున సీనియర్ న్యాయవాధి అధీస్ సీ అగర్ వాలా ఈ పిటిషన్ దాఖలు చేశారు. తన క్లయింటు జైలు జీవితం, అతని మానసిక పరిస్థితులను పరిశీలించి, ఉరిశిక్షను తప్పించాలని ఆయన కోరారు. ఇక ఈ పిటిషన్ లకు వ్యతిరేకంగా తీర్పు వస్తే, 22వ తేదీ ఉదయం 7 గంటలకు తీహార్ జైల్లో ఉరిశిక్షను అమలు చేస్తారు.