ఆలేరు మండలం గొలనుకొండలో తీవ్ర ఉద్రిక్తత
- నిన్న వెంకటరెడ్డి హత్య
- ఆందోళనకు దిగిన గ్రామస్తులు
- నిందితుడి ఇంటికి నిప్పు పెట్టిన వైనం
నిన్న సిరిపురం-గొలనుకొండ రహదారిలో వెంకటరెడ్డి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బైకుపై అతడు తన భార్యతో కలిసి జనగామకు వెళ్లి వస్తుండగా ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. వెంకటరెడ్డి బంధువులతో పాటు గ్రామస్తులు కూడా ఆందోళనకు దిగడంతో గ్రామంలో పోలీసులు బందోబస్తును పెంచారు.