నా సినిమాల ఫంక్షన్స్ అన్నింటికీ చిరంజీవి గారు రావాలని కోరుకుంటున్నా: రష్మిక
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా సినిమాల ఫంక్షన్స్ అన్నింటికీ చిరంజీవి గారు రావాలని కోరుకుంటున్నా: రష్మిక

  • వరుస హిట్లతో ఊపుమీదున్న రష్మిక
  • ఛలోక్తులు విసిరిన చిరు
  • ఓ ఇంటర్వ్యూలో స్పందించిన రష్మిక
టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ హీరోయిన్ రష్మిక మందన్న. ఛలో, గీతగోవిందం వంటి చిత్రాలతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టిన ఈ కన్నడ బ్యూటీ ప్రస్తుతం మహేశ్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటించింది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర సంగతులు వెల్లడించింది. నిన్న జరిగిన సరిలేరు నీకెవ్వరు ప్రీరిలీజ్ ఈవెంట్ లో రష్మికపై చిరంజీవి ఛలోక్తులు విసిరారు.

"నన్నేమైనా కాంట్రాక్ట్ కు తీసుకున్నావా... నీ ప్రతి సినిమా ఫంక్షన్ కు నేను వస్తున్నా, ఛలో సినిమాకు వచ్చాను, గీతగోవిందం సినిమాకు వచ్చాను, ఎక్కడికి వెళ్లినా నువ్వే ఉంటున్నావు" అంటూ చిరంజీవి రష్మికను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీనిపై రష్మిక ఇంటర్వ్యూలో స్పందిస్తూ, "ఎందుకో సర్ మీరే నా లక్కీ చార్మ్" అని చెప్పానని, ఆయనది మంచి మనసు అని కొనియాడింది. నా ప్రతి సినిమా ఫంక్షన్ కు చిరంజీవి గారే రావాలని కోరుకుంటున్నాను అంటూ తెలిపింది.
Rashmika
Chiranjeevi
Tollywood
SarileruNeekevvaru
Mahesh Babu

More Telugu News