'జబర్దస్త్'లో అత్యధిక రెమ్యునరేషన్ నాదే: చమ్మక్ చంద్ర
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'జబర్దస్త్'లో అత్యధిక రెమ్యునరేషన్ నాదే: చమ్మక్ చంద్ర

  • సినిమాల నుంచి వచ్చే డబ్బు గురించి చెప్పలేం 
  • 'జబర్దస్త్' నుంచి డబ్బు కచ్చితంగా వచ్చేది 
  • పారితోషికాన్ని అలా పంచుతానన్న చమ్మక్ చంద్ర
'జబర్దస్త్' కామెడీ షో ద్వారా చమ్మక్ చంద్ర క్రేజ్ పెరిగిపోయింది. ఈ షోను ఫాలో అయ్యేవారు, ఆయన స్కిట్ ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఆత్రుతతో ఎదురుచూసేవారు. అలాంటి చమ్మక్ చంద్ర తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, " సినిమా అవకాశాలు వస్తున్నప్పటికీ, ఏ సినిమాకి ఎన్ని రోజుల వర్క్ ఉంటుందో చెప్పలేము. అలాగే ఏ సినిమాకి ఎంత ఇస్తారో కూడా చెప్పలేము.

అదే 'జబర్దస్త్' షో నుంచి అయితే ప్రతి నెలా మాకు ఒక ఫిక్సెడ్ అమౌంట్ వస్తుంది .. అదే మా ధైర్యం. 'జబర్దస్త్'లో వున్న అన్ని టీమ్స్ కంటే నా టీమ్ కే పారితోషికం ఎక్కువ. అంటే నేను తీసుకునే పారితోషికమే ఎక్కువ. నా టీమ్ లో సభ్యులు ఎక్కువమంది వుంటారు. అలా నా స్కిట్ లను నేను ప్లాన్ చేసుకుంటాను. నాతో పాటు స్టేజ్ పై మిగతా వాళ్లు కనిపించినప్పటికీ, వాళ్ల పాత్రల ప్రాధాన్యతను బట్టి పారితోషికాన్ని పంచుతాను" అని చెప్పుకొచ్చాడు.
Chammak Chandra

More Telugu News