namrata: ఈ ముగ్గురితో నా జీవితం సంపూర్ణమైంది: మూడు ఫొటోలు పోస్ట్ చేసి మహేశ్ బాబు భార్య నమ్రత భావోద్వేగం

షార్ట్స్‌లో చూడండి
ఈ ముగ్గురితో నా జీవితం సంపూర్ణమైందంటూ మహేశ్ బాబు భార్య, సినీనటి నమ్రత మూడు ఫొటోలు పోస్ట్ చేశారు. తన మామయ్య సూపర్‌స్టార్‌ కృష్ణ, భర్త మహేశ్‌బాబు, కుమారుడు గౌతమ్‌ల ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ ముగ్గురు తన సూపర్‌ హీరోలని, వీరితో తన జీవితం సంపూర్ణమైందని ఆమె పేర్కొన్నారు.

తన మీద ఈ ముగ్గురు చూపిస్తున్న ప్రేమ, గౌరవానికి కృతజ్ఞురాలినని నమత్ర భావోద్వేగభరితంగా వ్యాఖ్యలు చేశారు. ప్రతిసారీ ఈ ముగ్గురు తనకు ఓ కొత్త విషయాన్ని నేర్పిస్తున్నందుకు సంతోషంగా ఉందని, వీళ్లే తన బలమని చెప్పారు. ఈ ఫొటోల్లో కృష్ణ, మహేశ్, గౌతమ్ తెల్ల చొక్కాలు వేసుకొని టై కట్టుకొని ఒకేలా ఫోజులిచ్చారు.
Go Back to Shorts
namrata
Mahesh Babu
Instagram

More Telugu News