కమలహాసన్ పై గౌతమిని ప్రయోగించే ఆలోచనలో బీజేపీ!
- మక్కల్ నీది మయ్యమ్ తో దూసుకొస్తున్న కమల్
- కమల్ ను అడ్డుకోవాలన్న ఆలోచనలో బీజేపీ
- గౌతమికి కీలక పదవిని ఇవ్వాలన్న ఆలోచన
కమలహాసన్, నటి గౌతమిలు కొన్నాళ్ల క్రితం విడిపోయిన సంగతి తెలిసిందే. తాను ఏర్పాటు చేసిన పార్టీతో కమల్ రాజకీయ ప్రయాణంలో బిజీ కాగా, గౌతమి టీవీ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో సాగుతున్నారు. ఇటీవల ఆమె ప్రధాని నరేంద్ర మోదీతో సైతం భేటీ అయ్యారు. రాష్ట్రంలో బీజేపీ నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల్లో భాగం అయ్యారు. దీంతో కమల్ కు దీటైన సమాధానం చెప్పాలంటే గౌతమి మాత్రమే తమకు సరైన ఆప్షన్ అని బీజేపీ భావిస్తోంది.