'బస్తీ బాలరాజు'గా కనిపించనున్న కార్తికేయ
- కార్తికేయ తదుపరి సినిమాకి సన్నాహాలు
- దర్శకుడిగా కౌశిక్ పెగళ్లపాటి పరిచయం
- త్వరలో వెలువడనున్న ప్రకటన
ఈ నేపథ్యంలో ఆయన తన తదుపరి సినిమాకి సన్నాహాలు చేసుకుంటున్నాడు. బన్నీవాసు నిర్మిస్తున్న ఈ సినిమాకి కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. 'చావు కబురు చల్లగా' అనే టైటిల్ పరిశీలనలో వుంది. ఈ సినిమాలో 'బస్తీ బాలరాజు' పాత్రలో కార్తికేయ కనిపించనున్నాడని సమాచారం. ఈ సినిమాలో కార్తికేయ సరసన నాయికగా లావణ్య త్రిపాఠి నటించనుంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.