విక్రమ్ ఆశలన్నీ ఆ సినిమా పైనేనట
- విభిన్నమైన కథలకి ప్రాధాన్యత
- విలక్షణ పాత్రలవైపు మొగ్గు
- తాజా చిత్రంగా సెట్స్ పై 'కోబ్రా'
టైటిల్ .. దానిని డిజైన్ చేసిన తీరుకి మంచి మార్కులు పడ్డాయి. లలిత్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాపై విక్రమ్ అభిమానుల్లో అంచనాలు వున్నాయి. ఈ సినిమాలోనూ ఆయన కొత్తగా కనిపించనున్నాడని అంటున్నారు. ఈ మధ్య కాలంలో విక్రమ్ కి చెప్పుకోదగిన హిట్ పడలేదు. సీనియర్స్ స్టార్ హీరోల రేసులో ఆయన చాలా వెనుకబడిపోయాడు. అయితే ఈ సినిమాతో తనకి తప్పకుండా భారీ హిట్ పడుతుందనే ఆశాభావంతో విక్రమ్ వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.