Devineni Uma: గొల్లపూడిలో దేవినేని ఉమను అరెస్ట్ చేసిన పోలీసులు

షార్ట్స్‌లో చూడండి
టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు అరెస్ట్ చేశారు. అమరావతి రైతుల ఆందోళనకు సంఘీభావంగా దేవినేని ఉమ గొల్లపూడిలో రోడ్డుపై బైఠాయించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో రైతులు, మహిళలు తరలివచ్చారు.

ఈ నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి పోలీసులు యత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నిరసనలకు అనుమతి లేదని చెప్పిన పోలీసులు, దేవినేని ఉమను అదుపులోకి తీసుకుని, అక్కడి నుంచి తరలించారు. ఈ నేపథ్యంలో, గొల్లపూడిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Go Back to Shorts
Devineni Uma
Telugudesam
Arrest

More Telugu News