Vijay Sai Reddy: 'రాజధాని' ప్రకటన తర్వాత తొలిసారి జగన్ వస్తున్నారు.. కనీవినీ ఎరుగని విధంగా స్వాగతం పలకండి: విజయసాయి రెడ్డి

షార్ట్స్‌లో చూడండి
ఈ నెల 28న విశాఖకు వస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు కనీవినీ ఎరుగని విధంగా స్వాగతం పలకండంటూ ప్రజలకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పిలుపునిచ్చారు.

 'విశాఖను పాలనాపరమైన రాజధానిగా జగన్ ప్రకటించిన తర్వాత తొలిసారిగా ఈ నెల 28న విశాఖ ఫెస్ట్ కు ఆయన వస్తున్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి అపూర్వ స్వాగతం పలుకుదాం. విశాఖను రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో థాంక్యూ జగనన్నా అంటూ జననేతకు ధన్యవాదాలు చెబుదాం' అని ప్రకటన చేశారు.

'రాజధాని పట్ల ఉత్తరాంధ్ర ఎంతగా సంతోషిస్తోందో మిగతా రాష్ట్రానికి, దేశానికి తెలిసేలా మనమంతా చేతులు కలిపి ఆయనకు స్వాగతం పలుకుదాం. సీఎం ప్రయాణించే మార్గానికి ఇరు వైపులా నిలబడి మానవ తోరణంగా ఏర్పడి థ్యాంక్యూ జగనన్నా అంటూ గొప్పగా స్వాగతం పలుకుదాం' అని విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు.
Go Back to Shorts
Vijay Sai Reddy
YSRCP
Jagan

More Telugu News