పాలకన్నా బీరే మిన్న: పెటా వినూత్న ప్రచారం!
- డెయిరీ ఉత్పత్తులతో సైడ్ ఎఫెక్ట్స్
- గుండె వ్యాధులు, ఒబేసిటీ ఖాయం
- హార్వార్డ్ పరిశోధనలను ఉటంకించిన పెటా
పాలతో పోలిస్తే, బీర్ చాలా మంచిదని ఇందులో ఎటువంటి అనుమానాలూ వద్దని పెటా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ట్రేసీ రీమాన్స్ తెలిపారు. పాల ఉత్పత్తులను అధికంగా తీసుకుంటే, గుండె సంబంధిత వ్యాధులు, ఒబెసిటీ, మధుమేహం, క్యాన్సర్ తదితర వ్యాధులు వస్తాయని ఆయన హెచ్చరించారు. పాల అధిక వాడకంతో ఎముకల వ్యాధి సోకే ప్రమాదముందని రుజువు చేస్తూ, కొన్ని రుజువులను కూడా ఆయన తన ప్రకటనలో తెలిపారు. ఇదే సమయంలో బీరుతో ఎముకలు గట్టి పడతాయని అన్నారు.