ఝార్ఖండ్లో ప్రారంభమైన తుదిదశ ఎన్నికల పోలింగ్.. బారులు తీరిన ఓటర్లు
- 16 నియోజకవర్గాల్లో కొనసాగుతున్న పోలింగ్
- బరిలో మాజీ ముఖ్యమంత్రి, మంత్రులు
- 23న ఫలితాలు
మొత్తం 16 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుండగా మొత్తం 40,05,287 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం నేత అయిన హేమంత్ సోరెన్, ఇద్దరు మంత్రులు ఈ విడతలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. హేమంత్ సోరెన్ దుమ్కా, బర్హెట్ స్థానాల నుంచి బరిలో నిలవగా, దమ్కాలో ఆయనకు ప్రత్యర్థిగా బీజేపీ మహిళా నేత, రాష్ట్ర శిశు సంక్షేమశాఖ మంత్రి లూయిస్ మారండీ పోటీలో ఉన్నారు. శరత్ నియోజకవర్గం నుంచి ఆ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి రాన్ధిర్సింగ్ బరిలోకి దిగారు. ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.