Andhra Pradesh: సమయం, సందర్భం లేకుండా తన 40 ఏళ్ల అనుభవం గురించి చెప్పుకుంటారు: చంద్రబాబుకి విజయసాయి రెడ్డి చురక

షార్ట్స్‌లో చూడండి
సమయం, సందర్భం లేకుండా తన 40 ఏళ్ల అనుభవం గురించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పుకుంటారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. ఇదే విషయం గురించి  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గుర్తు చేస్తే చంద్రబాబు ఎందుకు అసహనం వ్యక్తం చేస్తున్నారని చురకలంటిస్తూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

'సమయం, సందర్భం లేకుండా తన 40 ఏళ్ల అనుభవం గురించి, 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన ముచ్చట్లు, సెల్ ఫోన్లు తెచ్చానన్న కోతలు, ఉన్నవీ లేనివీ చెప్పుకున్నది తమరే కదా బాబూ? ఇప్పుడు అదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గారు ప్రస్తావిస్తే నొచ్చుకోవడమెందుకు?' అని విమర్శలు గుప్పించారు.
Go Back to Shorts
Andhra Pradesh
Vijay Sai Reddy
Jagan
Chandrababu

More Telugu News