'ఆర్ఆర్ఆర్' కొమురం భీమ్ అఫీషియల్ లుక్ విడుదల!

  • షూటింగ్ దృశ్యాలు లీక్
  • కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్
  • వైరల్ అవుతున్న ఎన్టీఆర్ లుక్
దర్శకుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ జరుగుతున్న దృశ్యాలు ఆన్ లైన్ లో లీక్ కావడంతో, అప్రమత్తమైన యూనిట్ మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్న వేళ, ఆయన లుక్, సన్నివేశాలను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో ఉంచడంతో వైరల్ అయింది. దీంతో ఎన్టీఆర్ అఫీషియల్ లుక్ ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. తలపాగా, గడ్డంతో సీరియస్ గా చూస్తున్నట్టు ఉన్న ఎన్టీఆర్ లుక్ మరింత వైరల్ అవుతోంది.
Go Back to Shorts
RRR
NTR
First Look
Official

More Telugu News