Akkineni: తల్లికిచ్చిన మాట కోసం తప్పుడు ప్రచారాన్ని తట్టుకున్న ఏఎన్నార్!

షార్ట్స్‌లో చూడండి
తెలుగు చిత్రపరిశ్రమకి ఎన్టీఆర్ - ఏఎన్నార్ రెండు కళ్లు. అయితే కెరియర్ తొలినాళ్లలో వాళ్లు కూడా విమర్శలను ఎదుర్కొన్నవారే. ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు తనపై వచ్చిన విమర్శలను తట్టుకోలేక ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నారంటూ, సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ ఒక విషయాన్ని గురించి ప్రస్తావించారు.

"అక్కినేని సినిమాల్లో అవకాశాలను సంపాదించుకోవడం కోసం మద్రాసు బయల్దేరారు. సినిమాల్లోకి వెళ్లిన వారు చెడిపోతారనే ప్రచారం ఆ రోజుల్లో ఎక్కువగా ఉండేది. అందువలన అక్కినేనిని పంపించడానికి ఆయన తల్లి ఒప్పుకోలేదు. తను ఎలాంటి పిచ్చిపనులు చేయనని తల్లికి మాట ఇచ్చి అక్కినేని మద్రాసు వెళ్లారు.

వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ, తల్లికిచ్చిన మాట కోసం ఆయన ఆడపిల్లలకు దూరంగా ఉండేవారు. వాళ్లతో మాట్లాడటం .. చనువుగా మసలుకోవడం చేసేవారు కాదు. దాంతో ఆయన క్రమశిక్షణను తప్పుగా అర్థం చేసుకున్న కొందరు మరోలా ప్రచారం చేశారు. ఆ విమర్శలను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్న అక్కినేని, అలా చేస్తే జరుగుతున్న ప్రచారం నిజమవుతుందని భావించి, ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు" అని చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
Akkineni
Eeshwar

More Telugu News