దక్షిణాది గురించి జాతీయ మీడియా ఎన్నడూ పట్టించుకోదు: తలసాని

  • ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎన్ కౌంటర్ ఘటనపై దృష్టి సారించారు
  • దీనిపై ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు
  • నిందితులకు తెలంగాణ పోలీసులు తగిన గుణపాఠం చెప్పారు
దక్షిణ భారత్ గురించి జాతీయ మీడియా ఎన్నడూ పట్టించుకోదని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అయితే, ఇప్పుడు ప్రతి ఒక్కరు హైదరాబాద్ ఎన్ కౌంటర్ ఘటనపై దృష్టి సారించారని తెలిపారు. దీనిపై ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారని అన్నారు.

నిందితులకు తెలంగాణ పోలీసులు తగిన గుణపాఠం చెప్పారని ప్రజలు అంటున్నారని తలసాని వ్యాఖ్యానించారు. దేశానికి తెలంగాణ ప్రభుత్వం ఓ సందేశం ఇచ్చిందని ఆయన అన్నారు. కాగా, హైదరాబాద్ శివారులోని దిశ ఘటన నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
Talasani
Hyderabad
India

More Telugu News