రేపిస్టులపై దయ చూపాల్సిన అవసరం లేదు: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
- మహిళల భద్రత అనేది చాలా ముఖ్యమైన విషయం
- అత్యాచార దోషులకు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునే అవకాశం ఉండొద్దు
- క్షమాభిక్ష పిటిషన్లపై పార్లమెంట్ పున:సమీక్షించాలి
పోక్సో చట్టం కింద అత్యాచార నిందితులుగా నిర్ధారించబడిన వారికి క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసే అర్హత లేదని, క్షమాభిక్ష పిటిషన్లపై పార్లమెంట్ పున:సమీక్షించాలని సూచించారు. ఇదిలా ఉండగా, నిర్భయ నిందితుడి క్షమాభిక్ష పిటిషన్ ఫైల్ ను రాష్ట్రపతికి కేంద్ర హోం శాఖ పంపింది. ఈ పిటిషన్ ను తిరస్కరించాలని రాష్ట్రపతికి హోంశాఖ సూచించినట్టు సమాచారం.