రాజ్ తరుణ్ కోసం అనుకున్న కథలో నిఖిల్?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాజ్ తరుణ్ కోసం అనుకున్న కథలో నిఖిల్?

  • నిర్మాతగా సుకుమార్ 
  •  దర్శకుడిగా సూర్యప్రతాప్ 
  •  రాజ్ తరుణ్ ప్లేస్ లో నిఖిల్?
సుకుమార్ - గీతా ఆర్ట్స్ 2 వారు సంయుక్తంగా ఒక సినిమాను నిర్మించనున్నారు. సుకుమార్ కథ - స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాకి సూర్య ప్రతాప్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. నిఖిల్ హీరోగా త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

అయితే రాజ్ తరుణ్ - సూర్యప్రతాప్ కాంబినేషన్లో గతంలో వచ్చిన 'కుమారి 21F' అప్పట్లో భారీ విజయాన్ని నమోదు చేసింది. తన తదుపరి సినిమా మళ్లీ రాజ్ తరుణ్ తోనే ఉంటుందని ఇటీవల సూర్యప్రతాప్ చెప్పాడు. కానీ హఠాత్తుగా ఆయన నిఖిల్ ప్రాజెక్టును పట్టాలెక్కించాడు. రాజ్ తరుణ్ కోసం అనుకున్న కథను తాత్కాలికంగా పక్కన పెట్టేశాడా? లేదంటే ఆ ప్రాజెక్టు అటకెక్కిందా? అనే విషయాన్ని గురించే ఇప్పుడు ఫిల్మ్ నగర్లో మాట్లాడుకుంటున్నారు.
Nikhil
Raj Tarun

More Telugu News