జైలు నుంచి బయటకు రానున్న చిదంబరం ... బెయిల్ మంజూరు!
- ఐఎన్ఎక్స్ మీడియా కేసులో నిందితుడు
- రూ. 2 లక్షల పూచీకత్తుపై బెయిల్
- విదేశాలకు వెళ్లరాదని ఆదేశం
సీబీఐ కేసులో ఇప్పటికే చిదంబరానికి బెయిల్ మంజూరు అయిన సంగతి తెలిసిందే. తమ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని ఈ సందర్భంగా అత్యున్నత ధర్మాసనం ఆదేశించింది. బెయిల్ పై బయటకు వచ్చిన తరువాత సాక్షులను ప్రభావితం చేయడంగానీ, సాక్ష్యాలను నాశనం చేయడానికి గానీ ప్రయత్నించరాదని హెచ్చరించింది. ఈ కేసుకు సంబంధించిన ఎటువంటి వ్యాఖ్యలనూ చేయరాదని షరతు విధించింది.