తిరుపతి ఐఐటీకి జాతీయస్థాయి అవార్డు!
తిరుపతి ఐఐటీ విద్యాసంస్థకు జాతీయస్థాయి అవార్డు లభించింది. పరిశుభ్రమైన ఉన్నత విద్యాసంస్థల ర్యాంకుల్లో తిరుపతి ఐఐటీ 6వ స్థానం సంపాదించింది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో స్వచ్ఛ క్యాంపస్ పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ మేరకు తిరుపతి ఐఐటీ అధికారులు అవార్డును స్వీకరించారు. తిరుపతిలో ఐఐటీ విద్యాలయం గత ప్రభుత్వ హయాంలో 2015లో స్థాపించారు.