చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ శకలాలను గుర్తించిన నాసా... ఫొటోలు విడుదల!
- గుర్తించిన లూనార్ రికొన్నైస్పాన్ ఆర్బిటర్
- కిలోమీటర్ పరిధిలో శకలాలు
- 24 ముక్కలు కనిపిస్తున్నాయన్న నాసా
సెప్టెంబర్ 26న ఏ ప్రాంతంలో విక్రమ్ ల్యాండర్ కూలిందో గుర్తించామని, లూనార్ రికొన్నైస్సాన్స్ ఆర్బిటర్ (LRO) ల్యాండర్ ను గుర్తించిందని నాసా పేర్కొంది. ల్యాండర్ నుంచి కొన్ని శకలాలు చిందరవందరగా పడ్డాయని, 24 చోట్ల ఈ శకలాలు కనిపిస్తున్నాయని వెల్లడించింది. దాదాపు ఒక కిలోమీటర్ పరిధిలో విక్రమ్ ల్యాండర్ శకలాలు ఉన్నాయని తెలిపింది.