పుల్వామా తర్వాత ఉగ్రవాదులు ఢిల్లీనే టార్గెట్ చేశారు: ఎన్ఐఏ
- ఫిబ్రవరిలో పుల్వామా దాడి
- మార్చిలో ఢిల్లీలో ఓ ఉగ్రవాది అరెస్ట్
- అతడిచ్చిన సమాచారంతో మరో ముగ్గురి పట్టివేత
అయితే మార్చిలో సజ్జద్ ఖాన్ అనే ఉగ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేయగా, అతడిచ్చిన సమాచారంతో మరో ముగ్గుర్ని కూడా పట్టుకున్నారు. వారిపై ఎన్ఐఏ అధికారులు సెప్టెంబరులో చార్జిషీటు దాఖలు చేశారు. కాగా వారిలో ఒకరైన బిలాల్ అహ్మద్ ఆత్మాహుతి దాడికి సిద్ధపడినట్టు తెలుస్తోంది. పుల్వామా ఉగ్రదాడి వీడియో చూసి ప్రభావితుడైన బిలాల్ తాను అమరుడయ్యేందుకు కూడా తెగించాడని ఎన్ఐఏ వర్గాలంటున్నాయి.