వైద్యురాలి హత్యాచారం కేసు.. రాత్రంతా నిందితుల విచారణ

  • నిందితులను ఘటనా స్థలం వద్దకు తీసుకెళ్లిన పోలీసులు
  • నేరం జరిగిన తీరు పరిశీలన 
  • నేడు శంషాబాద్ కోర్టుకు నిందితులు
సంచలనం సృష్టించిన వైద్యురాలి హత్యాచారం కేసులో చిక్కిన నలుగురు నిందితులను పోలీసులు రాత్రంతా విచారించారు. ఘటనా స్థలం వద్దకు వారిని తీసుకెళ్లిన పోలీసులు నేరం జరిగిన తీరును పరిశీలించారు. నిందితులను నేడు శంషాబాద్ కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు మరిన్ని వివరాలు రాబట్టేందుకు కస్టడీ కోరే అవకాశం ఉందని తెలుస్తోంది.

కాగా, గత రాత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పోలీసులు నిందితుల వివరాలను వెల్లడించారు. మొత్తం నలుగురు యువకులు ఈ కీచక పర్వంలో పాల్గొన్నట్టు చెప్పారు. నిందితుల్లో సూత్రధారి అయిన మహ్మద్ అరిఫ్ వయసు 26 ఏళ్లు కాగా, మిగతా ముగ్గురి వయసు 20 సంవత్సరాలే కావడం గమనార్హం.
Go Back to Shorts
shamshabad
doctor
court

More Telugu News