Priyaanka Reddy: దారుణంగా ప్రవర్తించిన నలుగురు మృగాళ్లు ... ప్రియాంక పోస్టుమార్టం నివేదిక వెల్లడి!

  • ఊపిరి ఆడకుండా చేసి చంపారు
  • రేప్ చేసిన నలుగురు
  • 70 శాతం కాలిన మృతదేహం
వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి పోస్టుమార్టం నివేదిక బయటకు వచ్చింది. ఆమెను ఊపిరి ఆడకుండా చేసి చంపేశారని వైద్యులు తేల్చారు. చంపేసే ముందు కనీసం నలుగురు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారని తమ నివేదికలో పేర్కొన్నారు. మృతదేహాన్ని దుప్పట్లో చుట్టారని, ఆపై కిరోసిన్ పోసి నిప్పంటించారని వెల్లడించారు.

 ఈ ఘటనలో ప్రియాంక మృతదేహం 70 శాతానికి పైగా కాలిపోయిందని, నిర్ధారించారు. కాగా, ఈ దారుణానికి ఆ ప్రాంతంలో లారీలను ఆపుకుని ఉన్న డ్రైవర్లే కారణమని పోలీసులు ఇప్పటికే గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అనంతపురం జిల్లాకు చెందిన ఓ లారీ డ్రైవర్, క్లీనర్ లను విచారిస్తున్నప్పటికీ, నిందితులు మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వారన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.
Priyaanka Reddy
Postmartam
Rape
Police

More Telugu News