వక్కంతం వంశీ దర్శకత్వంలో వరుణ్ తేజ్
- సినీ కథా రచయితగా మంచి పేరు
- దర్శకుడిగా 'నా పేరు సూర్య'తో పరాజయం
- తదుపరి సినిమాకి నిర్మాతగా అల్లు అరవింద్
తాజాగా ఆయన ఒక లైన్ సిద్ధం చేసుకుని, వరుణ్ తేజ్ కి వినిపించాడట. తనకి బాగా నచ్చిందనీ .. పూర్తి కథను సిద్ధం చేసుకుని రమ్మని అన్నట్టుగా సమాచారం. ఈ లైన్ అల్లు అరవింద్ కి కూడా నచ్చడంతో, తన సొంత బ్యానర్లో ఈ సినిమాను నిర్మించడానికి సిద్ధమవుతున్నాడని అంటున్నారు. కిరణ్ కొర్రపాటితో చేయవలసిన సినిమా షూటింగు పూర్తయిన తరువాత, వక్కంతం వంశీతో కలిసి వరుణ్ తేజ్ సెట్స్ పైకి వెళ్లనున్నాడని అంటున్నారు.