బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమాకి ముహూర్తం ఖరారు
- మాస్ యాక్షన్ హీరోగా మంచి పేరు
- 'రాక్షసుడు'తో దక్కిన తాజా హిట్
- ఈ నెల 29న పట్టాలెక్కనున్న ప్రాజక్టు
గతంలో 'కందిరీగ' సినిమాతో హిట్ కొట్టిన సంతోష్ శ్రీనివాస్, ఆ తరువాత చేసిన 'రభస' .. 'హైపర్' పరాజయంపాలు కావడంతో రేసులో వెనకబడ్డాడు. ఆ మధ్య ఒకరిద్దరు హీరోలతో ప్రాజెక్టులను సెట్ చేసుకోవడానికి ప్రయత్నించాడుగానీ కుదరలేదు. ఇటీవల ఆయన ఒక కథ చెప్పి బెల్లంకొండ శ్రీనివాస్ ను ఒప్పించాడు. ఈ సినిమాను ఈ నెల 29వ తేదీన లాంచ్ చేయనున్నారు. ఆ రోజున మిగతా వివరాలు తెలియనున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.