Kamal Haasan: కమలహాసన్, రజనీకాంత్ రాజకీయాల గురించి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది: నటుడు శరత్ కుమార్
తమిళ నట దిగ్గజాలు కమలహాసన్, రజనీకాంత్ ఇటీవల తరచుగా రాజకీయపరమైన అంశాలనే మాట్లాడుతూ వచ్చే ఎన్నికలపై ఆసక్తి పెంచుతున్నారు. దీనిపై సీనియర్ నటుడు శరత్ కుమార్ స్పందించారు. తనకు రజనీకాంత్, కమలహాసన్ మంచి స్నేహితులని, కానీ వాళ్లు రాజకీయాల గురించి మాట్లాడడమే ఆశ్చర్యంగా ఉందని అన్నారు. తోటి నటులుగా కమల్, రజనీలను ఎంతో గౌరవిస్తానని, రజనీ, కమల్ రాజకీయాల్లో కలిసినా కలవకపోయినా తాను పెద్దగా పట్టించుకోనని తెలిపారు. 2021లో రజనీకాంత్ గెలుస్తాడా? కమలహాసన్ సీఎం అవుతాడా? అనే చర్చ మంచిది కాదని అభిప్రాయపడ్డారు.