Nayeem: గ్యాంగ్ స్టర్ నయీమ్ సోదరి సలీమా అరెస్ట్

షార్ట్స్‌లో చూడండి
గ్యాంగ్ స్టర్ నయీమ్ ఎన్ కౌంటర్ తరువాత, ఆయన దందాలను కొనసాగిస్తున్నట్టుగా ఆరోపణలు రావడంతో అతని చెల్లెలు సలీమా బేగమ్ ను నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. భూముల ఆక్రమణ, బెదిరింపులకు ఆమె పాల్పడినట్టుగా గత కొంతకాలంగా ఫిర్యాదులు వస్తుండటంతో నిఘా పెట్టిన భువనగిరి పోలీసులు, సలీమాను అదుపులోకి తీసుకున్నారు. ఆ వెంటనే కోర్టులో ప్రవేశపెట్టి రిమాండుకు తరలించారు. నేడు ఆమెను కస్టడీలోకి తీసుకుని, నయీమ్ సాగించిన హత్యలు, కిడ్నాప్ తదితరాలపై విచారించాలని పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. నయీమ్ అనుచరులను గుప్పిట్లో పెట్టుకున్న సలీమా బేగమ్, వారితో కలిసి దందాలు సాగించినట్టు తెలుస్తోంది. మొత్తం నాలుగు కేసుల్లో భాగంగా ఆమెను అరెస్ట్ చేశామని పోలీసు అధికారులు వెల్లడించారు.
Go Back to Shorts
Nayeem
Salema Begum
Arrest
Police

More Telugu News